మహానాడు కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఇవాళ ముఖ్యనేతల భేటీ జరిగింది. మహానాడు నిర్వహణ, తీర్మానాలపై సమావేశంలో నేతలు చర్చించారు. యనమల, దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, అశోక్‌బాబు తదితరులు భౌతిక దూరం పాటిస్తూ సమావేశంలో పాల్గొన్నారు. ఈనెల 27, 28 తేదీల్లో 6 గంటల్లో మహానాడు కార్యక్రమం పూర్తిచేసేలా ప్రణాళికలు చేశారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే మహానాడులో 14 వేలమంది పాల్గొనేలా కార్యచరణ రూపొందిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో మహానాడు.. 14 వేలమంది పాల్గొనేలా కార్యచరణ - ఆన్‌లైన్‌లో మాహానాడు న్యూస్
మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. 6 గంటల్లోనే కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళికలు చేసింది.
mahanadu programme conduct on may 27th and 28th date