ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సెమిస్టర్ పరీక్షలు రాసే విద్యార్థుల భద్రతపై.. ప్రభుత్వం దృష్టి పెట్టాలి: లోకేశ్​

రాష్ట్రంలో సెమిస్టర్ పరీక్షలు రాసే 17 లక్షల మంది విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. కొవిడ్ మూడో దశ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే ప్రజల సహకారంతోనే పనిచేయాలని సూచించారు. ఈ మేరకు సీఎం జగన్​కు లేఖ రాశారు.

Lokesh write letter to cm Jagan
లోకేశ్​ లేఖ

By

Published : Jul 6, 2021, 6:54 PM IST

కొవిడ్ మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో.. రాష్ట్రంలో సెమిస్టర్ పరీక్షలు రాసే 17 లక్షల మంది విద్యార్థుల భద్రతపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఇంకా చాలా మంది విద్యార్థులు టీకా తీసుకోనందున క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు.

'డిగ్రీ, ఇంజ‌నీరింగ్ ప‌రీక్షల‌ రద్దు డిమాండ్ చేస్తూ.. కేరళ, కర్ణాటక, తెలంగాణలో విద్యార్థులు ఇప్పటికే నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలో ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం ముందే చర్యలు తీసుకోవాలి. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయడం వల్లే కొవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతానికంటే తక్కువకు వచ్చింది. మూడో దశ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే ప్రజల సహకారంతో ప్రభుత్వం పని చేయటం ఎంతో ముఖ్యం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు పరీక్షల క్యాలెండర్లు విడుదల చేయడంతో చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు. పరీక్షల ప్రక్రియ వల్ల మూడోదశ కొవిడ్ వ్యాప్తి విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. దీనికి ప్రత్యామ్నాయాలు ఆలోచించి సంసిద్ధం కావాలి' - నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details