గ్యాస్ లీకై విశాఖ వాసులు విషాదంలో ఉంటే వైకాపా నేతలు విష ప్రచారానికి తెర తీశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.వైకాపా పేటీఎం బ్యాచ్‌లు కనీస మానవతాధృక్పథం లేకుండా సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేస్తున్నారని ట్విటర్ వేదికగా ఆగ్రహించారు. దొంగతనాలు, దోపిడీలు, విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప వారికి మరోటి రాదని దుయ్యబట్టారు.
విషాదంలో ఉంటే విష ప్రచారానికి తెర లేపుతారా?: లోకేశ్ - నారా లోకేశ్ తాజా వార్తలు
గ్యాస్ లీకేజ్ ప్రమాదంతో విశాఖ వాసులు విషాదంలో ఉంటే వైకాపా పేటీఎం బ్యాచ్‌లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారానికి తెరలేపాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. విశాఖ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.
nara lokesh
విశాఖ వాసులు ఎవరూ ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ అన్ని చర్యలు తీసుకుంటాయని భరోసా ఇచ్చారు. పుకార్లను నమ్మవద్దని కోరారు. నిపుణుల సూచనలు పాటించాలని ప్రజలకు సూచించారు. పేటీఎం బ్యాచ్‌ల తప్పుడు ప్రచారాన్ని విజ్జతతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.