కరోనా దెబ్బకి పేదవాళ్ళు పనులు లేక ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అర్ధం చేసుకోండని జగన్ అంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు..1400 కోట్ల రూపాయలు వృధా చేసి ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు ఎందుకు వేశారో సమాధానం చెప్పాలన్నారు. ఇప్పుడు వాటిని చెరపడానికి మరో 1400 కోట్లు కలిపి మొత్తంగా 2800 కోట్లు ఎవరి సోమ్మో.. జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నిచోట్ల తన పార్టీ రంగులే ఉండాలనుకోవడం జగన్ మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. నెలకి హైకోర్టులో ఆరు మొట్టికాయలు, సుప్రీంకోర్టులో మూడు తలంటులు లేకపోతే జగన్‌కి నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు.
'ఆరు మెుట్టికాయలు, మూడు తలంటులు లేకపోతే జగన్‌కు నిద్ర పట్టదు' - లోకేశ్ ట
ఆరు హైకోర్టు మొట్టికాయలు, మూడు సుప్రీంకోర్టు తలంటులు లేకపోతే జగన్‌కి నిద్ర పట్టదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. కరోనా దెబ్బకి పేదవాళ్ళు పనులు లేక ఇబ్బంది పడుతుంటే... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అర్ధం చేసుకోండని జగన్ అంటున్నారని విమర్శించారు.
లోకేశ్ ట్వీట్