వైకాపా ప్రభుత్వంపై నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. కరోనా నియంత్రణలో విఫలమైందంటూ ఘాటుగా విమర్శించారు. గద్దెనెక్కిన పెద్దలకు కరోనా సోకితే ప్రత్యేక విమానంలో పక్కరాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు పంపిస్తున్నారని.. అదే నిరుపేదలకు వైరస్ వస్తే చెత్తబండిలో ప్రభుత్వాసుపత్రికి పంపిస్తున్నారంటూ మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఐ. భీమవరంలో అంబులెన్సుకి కాల్ చేసినా స్పందన లేకపోవటంతో.. చెత్తబండిలో కరోనా బాధితుడిని తరలించడం బాధాకరమన్నారు. అంబులెన్సులు పబ్లిసిటీ కోసమే ఉన్నాయని.. రియాలిటీలో చెత్తబండి మాత్రమే వస్తోందంటూ ఎద్దేవా చేశారు.
'పబ్లిసిటీ కోసం అంబులెన్సులు.. రియాలిటిలో చెత్తబండ్లు' - ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శలు
ప్రభుత్వ పెద్దలకు కరోనా సోకితే పక్క రాష్ట్రాలకు విమానంలో పంపుతూ.. నిరుపేదలకు వస్తే చెత్తబండిలో ప్రభుత్వాసుపత్రులకు పంపుతున్నారంటూ ప్రభుత్వంపై నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.
నారా లోకేశ్