14 నెలల్లో ఏ ప్రాంతంలోనూ ఒక్క ఇటుక పెట్టని జగన్ రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తానంటూ.. రాజు పులకేసిని తలపిస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వం మూడు ముక్కలాటతో మరో మహిళా రైతు గుండె ఆగిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం 60 సెంట్లు భూమి ఇచ్చిన రైతు సామ్రాజ్యం రాజధాని తరలింపు వార్త విని గుండెపోటుతో చనిపోవడం బాధాకరమన్నారు. తుగ్లక్ నిర్ణయాలతో బలవుతున్న రైతుల ఉసురు జగన్‌రెడ్డికి తగలక మానదని లోకేశ్ అన్నారు.
వైకాపా మూడుముక్కలాటతో మరో రైతు గుండె ఆగింది: లోకేశ్ - అమరావతిపై లోకేశ్ కామెంట్స్
మూర్ఖత్వానికి మానవ రూపం జగన్ రెడ్డి అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. 79 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నా.. ఆయన అహం చల్లారలేదని మండిపడ్డారు.
lokesh about amaravathi farmers