AP CORONA CASES: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 24,066 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 896 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 8,849 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 24,454 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైరస్ కారణంగా కొత్తగా మరో ఆరుగురు మరణించినట్లు పేర్కొంది.
దేశంలో మరో 50వేల కరోనా కేసులు..
భారత్లో కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గాయి. కొత్తగా 50,407 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ధాటికి మరో 804 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,36,962 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1.43 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,25,86,544
- మొత్తం మరణాలు: 5,07,981
- యాక్టివ్ కేసులు: 6,10,443
- మొత్తం కోలుకున్నవారు: 4,14,68,120