ఆ నలుగురి కారణంగా.. చనిపోవాలనుకుంటున్నా! - lady_suicide_attempt_vijayawad
నలుగురు వ్యక్తుల కారణంగా చనిపోవాలనుకుంటున్నానంటూ ఓ యువతి పంపిన సందేశం ఆమె స్నేహితులను, విజయవాడ కృష్ణ లంక పోలీసులను పరుగులు పెట్టించింది.
ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంటూ సెల్ఫీ దిగిన వీడియో విజయవాడలో కలకలం రేపింది. భర్తతో విభేదాల కారణంగా, మహేశ్వరి అనే మహిళ ఆత్మహత్యకు యత్నించింది. బస్టాండ్ దగ్గరలోని రైల్వే వంతెనపైపు వెళ్తూ... వీడియో తీసుకుంది. ఆ వీడియోను తన స్నేహితులకు పంపింది. వారు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇచ్చారు. వారు కృష్ణలంక పోలీసులను అప్రమత్తం చేశారు. రైల్వేవంతెన వద్దకు చేరుకున్న పోలీసులు తాడేపల్లి వైపునకు యువతి నడుచుకుంటూ వెళుతుండటాన్ని గమనించి అడ్డుకున్నారు. ఆమెను వారించి ఆమెను కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భర్త, కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించిన కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రేమించి చేసుకున్న వివాహం విఫలం కావడం, తల్లిదండ్రులతో విభేదాలే ఆత్మహత్యాయత్నానికి గల కారణాలంటూ మహేశ్వరి వీడియోలో వివరించింది.