'కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం' - జగన్
కాపులకు ఇచ్చిన హామీలను జగన్ అమలు చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విజయవాడలో కాపు కారొర్పేషన్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
kurasala_kannababu_about_kapu
కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా ప్రమాణా స్వీకారానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరయ్యారు. సభాధ్యక్షుడిగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యవహరించారు. కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. ఆర్థిక పరిపుష్టి సంతరించుకున్న ఏకైక కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ అని తెలిపారు.