ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SUSPEND: జీజీహెచ్ వైద్యురాలు సస్పెండ్​.. చెల్లింపులు నిలిపివేత!

బ్లాక్ ఫంగస్ రోగి నుంచి రూ. 22 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలతో విజయవాడ జీజీహెచ్​ వైద్యురాలు వాణి ప్రియను జేసీ సస్పెండ్​ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

By

Published : Aug 12, 2021, 9:11 PM IST

Published : Aug 12, 2021, 9:11 PM IST

జీజీహెచ్ వైద్యురాలి సస్పెండ్
జీజీహెచ్ వైద్యురాలి సస్పెండ్

బ్లాక్ ఫంగస్ చికిత్సకు రోగి వద్ద నుంచి రూ. 22 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు రావటంపై.. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విజయవాడ జీజీహెచ్​లో పని చేస్తున్న వైద్యురాలు వాణి ప్రియ ను జిల్లా జాయింట్ కలెక్టర్ విధుల నుంచి తొలగించారు. మరో స్టాఫ్​నర్స్​ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వైద్యురాలికి రావాల్సిన జీతం చెల్లింపులను నిలుపుదల చేసినట్లు ప్రకటించారు.

ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు జేసీ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేశారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. కమిటీ విచారణ చేసి నివేదిక ఇచ్చిన తర్వాత.. అందులోని వివరాల ఆధారంగా జీజీహెచ్ సూపరిటెండ్​పై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశముందని తెలిపారు. వైద్యురాలిని కొవిడ్ చికిత్స నిమిత్తం ప్రత్యేక భర్తీ విధానంలో తీసుకున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details