ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KRMB: రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించనున్న కృష్ణా బోర్డు ప్రతినిధులు

By

Published : Aug 3, 2021, 3:23 PM IST

Updated : Aug 4, 2021, 5:51 AM IST

Krishna board representatives visit Rayalaseema project
రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించనున్న కృష్ణా బోర్డు ప్రతినిధులు

15:17 August 03

సీమ సందర్శనకు తటస్థుల కమిటీతో రండి

రాయలసీమ ఎత్తిపోతల సందర్శనకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘానికి చెందిన తటస్థ సభ్యుల కమిటీ వస్తే తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన కమిటీలో తెలంగాణకు చెందిన ఒక సభ్యుడు ఉన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకు చెందని వారితో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి శ్యామలరావు మంగళవారం లేఖ రాశారు. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదుల బోర్డులను నోటిఫై చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని, వాటిలో రెండు రాష్ట్రాలకు చెందని వారే ఉండాలని ఆ నోటిఫికేషన్‌లోనూ స్పష్టం చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు ఆగస్టు 5న తమ కమిటీ రాయలసీమ ఎత్తిపోతల సందర్శనకు వస్తుందని, అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఎం.రాజపురే రాసిన లేఖకు స్పందనగా శ్యామలరావు సమాధానం ఇచ్చారు.

   తటస్థుల పరిశీలన సాధ్యం కాని పక్షంలో... కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పూర్తి స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తే అందులో చర్చించి కమిటీ సందర్శనపై నిర్ణయం తీసుకుందామని శ్యామలరావు పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఎన్నో ప్రాజెక్టులను తెలంగాణ నిర్మిస్తోందని, వాటిని సందర్శించాలని ఏపీ కోరుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఏ ప్రాజెక్టును ముందు ప్రారంభించారో ఆ వరుస క్రమంలో అన్నింటినీ బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ సందర్శిస్తే బాగుంటుందని లేఖలో ప్రతిపాదించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి

GRMB MEETING: అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేం: ఏపీ ఈఎన్​సీ

Last Updated : Aug 4, 2021, 5:51 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details