annavaram: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కోటి తులసి పూజ ఘనంగా ప్రారంభమైంది. 10 రోజుల పాటు నిత్యం స్వామి వారికి తులసి పూజ ఉంటుంది. 26న జరిపే పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో వార్షిక కల్యాణ వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆశీనులను చేసి వైదిక బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలో పాల్గొన్నారు.
అన్నవరం దేవస్థానంలో.. ఘనంగా కోటి తులసి పూజ - తూర్పు గోదావరి తాజా వార్తలు
annavaram temple: అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కోటి తులసి పూజ ఘనంగా ప్రారంభమైంది. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ నెల 26 వరకు ఈ పూజ కొనసాగనుంది.
అన్నవరం దేవస్థానంలో కోటి తులసి పూజ