పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) కరోనా బారినపడ్డారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తెదేపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు స్వల్ప లక్షణాలు కన్పించగా, వైద్య పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆయన కూడా ఏఐజీలో చేరారు. రాధా ఈనెల 9న కంచికచర్లలో రంగా విగ్రహావిష్కరణకు హాజరుకాగా.. పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.