తెలుగు యువత ఆత్మీయ సదస్సు - vijayawada
రాష్ట్రాభివృద్ధి కోసం మరో సారి తెదేపాకే అధికారం దక్కేలా కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ కేశినేని నాని ఉద్ఘాటించారు.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన తెలుగు యువత ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2014వలే ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారన్నారు.