గత డీఎస్సీలో వివిధ కారణాలతో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. డీఎస్సీ 1998 లో అర్హత పొందిన 36మంది అభ్యర్థులను కనీస మూల వేతన చెల్లింపుతో సెంకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమిస్తామన్నారు. 36 మంది అభ్యర్థుల్లో 6గురు మాత్రమే ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యారని... వీరి నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని ఆర్థిక శాఖకు పంపినట్లు శానస మండలిలో తెలిపారు. డీఎస్సీ 2008 లో డీఈడీ , బీఈడీ అభ్యర్థుల ఎంపికలో మార్పుల వల్ల ప్రభావితమైన 4 వేల 657 మంది అభ్యర్థులనూ కాంట్రాక్టు పద్దతిలో ఎస్జీటీలుగా నియామించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థిక శాఖ అనుమతి రాగానే నియామకాలు చేపడతామన్నారు.
డీఎస్సీలో నష్టపోయిన వారికి న్యాయం చేస్తాం : మంత్రి సురేశ్ - Justice to those who lost in DSC: Minister Suresh
వివిధ కారణాలతో గత డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.త్వరలోనే ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేస్తామన్నారు.
మంత్రి సురేశ్