టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్, ఐసోలేషన్, చికిత్సకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. నమూనాలు తీసిన 24 గంటల్లోనే పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి పరీక్ష నిర్వహణ, ఆస్పత్రుల్లో చేరడానికి అవకాశం ఉందని జవహర్‌రెడ్డి తెలిపారు.
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్, ఐసోలేషన్, చికిత్సకు ప్రాధాన్యం: జవహర్ రెడ్డి - ఏపీలో కరోనా తాజా వార్తలు
కరోనా కేసుల సంఖ్య 10 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్నారు. మరణాల రేటు ఒక శాతానికి తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
jawahar reddy about corona testings in ap