కరోనా వ్యాప్తి నివారణకు జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు విజయవాడలో ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. కర్ఫ్యూతో విజయవాడలోని రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ రోడ్డు వెలవెలబోతుంది. చెన్నై - విజయవాడ జాతీయ రహదారిపై అత్యవసర వాహనాలు మినహా, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరం మినహా మిగిలిన సేవలు అన్నీ బందయ్యాయి. విజయవాడలో కర్ఫ్యూ పరిస్థితిపై మా ప్రతినిధి అందిస్తోన్న వివరాలు..!
విజయవాడలో జనతా కర్ఫ్యూ.. రహదారులు నిర్మానుష్యం - benz circle janata curfew
జనతా కర్ఫ్యూతో విజయవాడ బెంజ్ సర్కిల్ నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది. ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలంతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. కర్ఫ్యూ నేపథ్యంలో రహదారులన్నీ బోసిపోయాయి.
విజయవాడ బెంజ్ సర్కిల్లో జనతా కర్ఫ్యూ