ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంబులెన్స్​లు ఏమయ్యాయి?

వైకాపా ప్రభుత్వ తీరుపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.

janasena leader pothina mahesh fire on ycp government
జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్

By

Published : Apr 29, 2021, 5:19 PM IST

Updated : Apr 30, 2021, 4:30 AM IST

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గడానికి కొన్ని నెలలు పడుతుంది. కానీ రాష్ట్రానికి పట్టిన బ్లూ పార్టీ వైరస్ ప్రభావం తగ్గడానికి మూడు సంవత్సరాలు పట్టేలా ఉందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా రెండో దశ వ్యాప్తిలో జగన్ సర్కార్ వైఫల్యం అడుగడుగునా కనపడుతుందన్నారు. కరోనా నిర్ధరణ ఫలితాల ప్రకటనలో జాప్యం ఎందుకని, అట్టహాసంగా ప్రారంభించిన అంబులెన్స్​లు ఎక్కడున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 104 కాల్ సెంటర్​లు సక్రమంగా పనిచేస్తే పడకల కోసం రోగులు అవస్థలు పడే అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇప్పటికైనా కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Last Updated : Apr 30, 2021, 4:30 AM IST

ABOUT THE AUTHOR

...view details