సాధించేది ఏమి లేకనే జగన్ సిట్లతో కాలక్షేపం చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. 9 నెలలుగా మంత్రుల సబ్కమిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చేయాలన్నారు... కానీ ఏం చెయ్యలేకపోయారని దుయ్యబట్టారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెదేపా అధినేతపై 26 కు పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సీబీసీఐడీ విచారణలు చేయించారు... కానీ చంద్రబాబును ఏం చేయలేకపోయారని లోకేశ్ ట్విట్టర్లో తెలిపారు.
'సాధించేది ఏమి లేకనే జగన్ సిట్ అంటున్నారు' - జగన్ పై లోకేశ్ వ్యాఖ్యలు
జగన్ సిట్లతో కాలక్షేపం చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. గతంలో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు విచారణలు, కమిటీలతో చంద్రబాబును ఏం చేయలేకపోయారని ట్వీట్ చేశారు.
లోకేశ్ ట్వీట్
ఇదీచదవండి
సిట్ కాదు.. సీబీఐతో విచారణ జరిపించండి: ఎంపీ గల్లా