విశాఖలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఐఎంఏ ముఖ్యమంత్రికి తెలిపింది. సీఎం పట్ల వైద్యుడు చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదని పేర్కొంది. వైద్యుడి పట్ల ఇలా ప్రవర్తించడం వైద్యులను మనోవేదనకు గురి చేస్తోందని లేఖలో తెలిపింది.
డాక్టర్ సుధాకర్ ఘటనపై ముఖ్యమంత్రికి ఐఎంఏ లేఖ - సుధాకర్ అరెస్టుపై ఐఎంఏ లేఖ న్యూస్
విశాఖ వైద్యుడు సుధాకర్ వ్యవహారంపై ముఖ్యమంత్రికి ఐఎంఏ లేఖ రాసింది. వైద్యుడు సుధాకర్ పట్ల పోలీసుల తీరు పూర్తిగా ఆక్షేపణీయమని పేర్కొంది.
indian medical association letter cm jagan on doctor sudhakar incident
ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ విభాగం సుధాకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారని.. ఐఎంఏ నిజనిర్ధారణ కమిటీ ప్రాథమిక నివేదికను కూడా ముఖ్యమంత్రికి పంపింది. మొత్తం వ్యవహారంపై స్వతంత్ర, న్యాయ దర్యాప్తు జరుగుతుందని ఆశిస్తున్నామని.. పోలీసులపైనా తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఐఎంఏ పేర్కొంది.
ఇదీ చదవండి:'సుధాకర్‌కు న్యాయం జరగపోతే.. భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాం'