రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లోనూ అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ల కోటా అమలు అవుతోందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టుల అడ్మిషన్లలోనూ అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసినట్లు ఉన్నత విద్యా మండలి తెలియజేసింది. అడ్మిషన్ల సమయంలో ఈడబ్ల్యూఎస్ కోటాకు విద్యార్థులు తమ వివరాలను తెలియచేయాలని ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు.
EWS Reservations: విద్యాసంస్థల్లో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ కోటా అమలు: ఉన్నత విద్యామండలి
విద్యాసంస్థల్లో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ కోటా అమలవుతోందని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. అన్ని సెట్‌ల ప్రవేశాల్లో ఈ ఏడాదీ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ కోటా అర్హులు అడ్మిషన్ల వేళ తమ వివరాలు చెప్పాలని తెలిపింది.
విద్యాసంస్థల్లో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ కోటా అమలు