పన్ను భారం లేకుండా ప్రశాంతంగా ఉండే నగరం కావాలంటే తెదేపా అభ్యర్ధులను కార్పొరేటర్లుగా ఎన్నుకోవాలని.. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్లో స్ధానిక కార్పొరేటర్ అభ్యర్ధి కిరణ్ తరుపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ నగరంలో వైకాపాని గెలిపిస్తే నగర ప్రజలకు పన్నుల భారం భారీగా పడుతుందని.. తాము అధికారంలోకి వస్తే పన్నుల భారం లేని నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నగరంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలపారు. అందుకే తాను స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు వివరించారు.
పన్ను భారం పడకుండా ఉండాలంటే తెదేపాను గెలిపించండి: కేశినేని నాని - మున్సిపల్ ఎన్నికలు వార్తలు
మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించాలని.. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని అన్నారు. వైకాపా పాలనలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు పన్నుల భారంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. విజయవాడ 51వ డివిజన్ తెదేపా అభ్యర్థి కిరణ్ తరఫున ఆయన ప్రచారం చేపట్టారు.
పన్ను భారం పడకుండా ఉండాలంటే తెదేపాను గెలిపించండి: కేశినేని నాని