ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్ధుల అసహజ మరణాలు సంభవిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో చోటు చేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కారణాల్ని కనుగొనేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని అభ్యర్ధిస్తూ పీపుల్ యూనిటీ ఫర్ సివిల్ లిబర్టీస్, హ్యూమన్ రైట్స్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడు ఇర్ఫాన్ అహ్మద్, న్యాయవాది పి.సంజీవ్ రెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచుతూ ఒత్తిడికి గురిచేయడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు ఏపీ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కళాశాల విద్య, సాంకేతిక విద్య, ఇంటర్ విద్య కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. ఇటీవల ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరిపిన ధర్మాసనం... తీర్పును రిజర్వు వేసింది. బుధవారం తుది తీర్పును వెల్లడించింది.
'అవి అసహజ మరణాలైతే.. విచారణ చేపట్టాల్సిందే.." - private schools
ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులవి అసహజ మరణాలైతే.. వాటిపై తక్షణమే విచారణ చేపట్టాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ధర్మాసనం ఆదేశించింది.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో అసహజ మరణాలపై హైకోర్టు తీర్పు