ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యం పాలసీ జోవోపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

High Court: బార్ల మద్యం పాలసీపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రభుత్వాన్ని కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.

మద్యం పాలసీ జోవోపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
మద్యం పాలసీ జోవోపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

By

Published : Jul 26, 2022, 9:40 PM IST

HC on Liquor Policy: బార్ల మద్యం పాలసీపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ.. స్టే విధించాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్​పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. రేపటి నుంచి వేలం ప్రారంభమవుతుందని, నాన్‌ రిఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. డిపాజిట్‌ తిరిగి ఇవ్వబోమని ప్రభుత్వం చెబుతోందని, దీనివల్ల నష్టపోతారని ధర్మాసనానికి వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం..మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రభుత్వాన్ని కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.

గడువు పొడిగింపు లేదు: రాష్ట్రంలో బార్ లైసెన్సుల కేటాయింపునకు సంబంధించి ఎలాంటి గడువు పొడిగింపూ లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన బార్ పాలసీని హైకోర్టు కూడా సమర్ధించిందని ఆయన స్పష్టం చేశారు. కొత్త బార్ పాలసీలో భాగంగా లాటరీ విధానంలోనే కేటాయింపులు జరుగుతాయని ఆయన వివరించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటీకరించే యోచనేదీ లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details