ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కూల్చేసిన గోడ కట్టుకునేందుకు.. అయ్యన్నకు హైకోర్టు అనుమతి - అయ్యన్న ఇంటిగోడ కూల్చివేత

గోడ కట్టుకునేందుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు
గోడ కట్టుకునేందుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు

By

Published : Jun 22, 2022, 5:54 PM IST

Updated : Jun 22, 2022, 6:28 PM IST

17:49 June 22

గోడ కట్టుకునేందుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు

మున్సిపల్‌ అధికారులు కూల్చివేసిన ఇంటి ప్రహరీ గోడను కట్టుకునేందుకు తెలుగుదేశం సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడుకు హైకోర్టు అనుమతిచ్చింది. నోటీసులు ఇవ్వకుండా.. అక్రమంగా ఇంటి గోడను నర్సీపట్నం మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారని అయ్యన్న కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా గోడ కూల్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. గోడ కట్టుకునేందుకు అనుమతిచ్చింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

ఏం జరిగిందంటే? :అయ్యన్న పాత్రుడు పంటకాలువ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.. ఈనెల 19న అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ మున్సిపల్ సిబ్బంది నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్నపాత్రుడి కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయ్యన్నపాత్రుడి ఇంటి చుట్టుపక్కల అర్ధరాత్రి నుంచే.. విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపేశారు. అయ్యన్నపాత్రుడి వద్ద పనిచేసేవారు, నిత్యావసరాలు తీసుకొచ్చే వారిని కూడా.. పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదు. అలాగే.. అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లే రెండు మార్గాలనూ పోలీసులు మూసివేశారు. మీడియాను ఆ పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు చేపట్టారు. నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలోనే పోలీసుల బలగాలు మోహరించారు.

అన్ని నియమాలకు లోబడే ఇంటి నిర్మాణం చేశామని.. ఇంటి గోడ ధ్వంసం చేయడంపై ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడి రెండో కుమారుడు రాజేష్‌ను పోలీసులు చుట్టుముట్టారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు, అధికారులతో.. అయ్యన్న కుటుంబం వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

ఇవీ చూడండి :

Last Updated : Jun 22, 2022, 6:28 PM IST

ABOUT THE AUTHOR

...view details