జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ జనసేన పార్టీ కార్యదర్శి శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్ను కొనసాగిస్తూ ఎన్నికలు జరపటం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది.. వాదనలు వినిపించారు. పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం... ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.
పరిషత్ ఎన్నికలపై జనసేన పిటిషన్.. కౌంటర్ దాఖలుకు ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం - janasena updates
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఎన్నికలు నిర్వహించటం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
జనసేన పిటిషన్పై హైకోర్టు విచారణ