కర్నూలు జిల్లా ఆదోనిలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పట్టణంలోని పెద్ద మార్కెట్, చిన్న మార్కెట్, కంచిగారి వీధి, లంగర్బావి వీధి, గౌలి పేట, కౌడలపేట లో మోకాలి లోతు నీరు నిలిచింది. కృష్ణాజిల్లా గన్నవరంలో కురుస్తున్న వర్షాలకు పోలీస్ స్టేషన్ ఆవరణలో నీరు నిలిచింది. ఫలితంగా విధులకు వచ్చే సిబ్బంది, అధికారులు, ఫిర్యాదు దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి, నూతన భవనాన్ని నిర్మించడంతో పాటు.. ఇప్పుడున్న స్టేషన్‌కు తాత్కాలిక మరమ్మతులు చేయాలని పోలీస్ సిబ్బంది కోరుతున్నారు.
rains: భారీ వర్షాలు.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు - ఆదోనిలో వర్షం
కర్నూలు జిల్లా ఆదోని, కృష్ణా జిల్లా గన్నవరంలో భారీ వర్షం(heavy rain) కురిసింది. ఆదోనిలో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. గన్నవరంలో పోలీస్ స్టేషన్ నీట మునిగింది.
ఆదోని, గన్నవరంలో వర్షాలు