ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటి అద్దె 5 వేలు.. కరెంటు బిల్లు 7 వేలు!

రోజు వారీ కూలీ చేసుకునే తాము... వేలల్లో విద్యుత్ ఛార్జీలు వస్తే ఎలా కట్టాలని... విజయవాడ రామలింగేశ్వర నగర్ కు చెందిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడలో విద్యుత్ ఛార్జీల మోత

By

Published : Jul 3, 2019, 8:03 PM IST

విజయవాడలో విద్యుత్ ఛార్జీల మోత

విజయవాడలో పలు చోట్ల విద్యుత్ బిల్లులు మోత మోగిస్తున్నాయి. బిల్లులు అందుకున్న వినియోగదారులు వాటిని చూసి అవాక్కవుతున్నారు. రూ.7 వేలకు పైగా రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ రామలింగేశ్వరనగర్ కు చెందిన పలువురు.. ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్న తాము.... వేలకు వేలు విద్యుత్ బిల్లులు ఎలా కట్టాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఏసీ లాంటి గృహోపకరణాల పేరు చెప్పి విద్యుత్ సిబ్బంది... 3 వేల రూపాయలు డిపాజిట్ రూపంలో చెల్లించాలంటున్నారని.... కట్టని పక్షంలో ఫ్యూజులు లాక్కెళ్తామంటూ హెచ్చరిస్తున్నారని వాపోతున్నారు. 5 వేలు ఇంటి అద్దె కట్టే తాము....7 వేల బిల్లు ఎలా కట్టాలని ఆవేదన వారు వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details