విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి(ఈవో) సురేష్‌బాబు నియామకానికి గతేడాది ఆగస్టు 21న ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు తప్పుబటి రద్దు చేసింది. డిప్యూటి కమిషనర్ హోదా కలిగిన వ్యక్తిని ఈవోగా నియమించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. దుర్గగుడి ఈవో సురేష్ బాబు నియామకాన్ని సవాలు చేస్తూ జనసేన నేత పోతుల మహేష్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. మరోవైపు వ్యాజ్యంపై విచారణ జరుగుతున్న సమయంలోనే సురేశ్‌కు గ్రేడ్‌ను పెంచుతూ ప్రభుత్వం పదోన్నతి ఇచ్చింది.
దుర్గగుడి ఈవో నియామకాన్ని తప్పుబట్టిన హైకోర్టు - ఏపీ హైకోర్టు వార్తలు
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవోగా సురేష్‌బాబును నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఈవోగా సురేశ్‌బాబును నియమించడాన్ని సవాల్ చేస్తూ జనసేన నేత పోతుల మహేశ్ వేసిన వ్యాజ్యంపై విచారణ జరిపి ఈ మేరకు ఆదేశాలు వెల్లడించింది.
ap high court