ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HALF DAY SCHOOLS : నేటి నుంచే ఒంటి పూట బడులు - ఏపీలో ఒంటిపూట బడుల వార్తలు

HALF DAY SCHOOLS : వేసవి తీవ్రత దృష్ట్యా నేటి నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు.

HALF DAY SCHOOLS :
HALF DAY SCHOOLS :

By

Published : Apr 4, 2022, 4:43 AM IST

HALF DAY SCHOOLS : వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా సోమవారం నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వ హించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇంటికి పంపాలన్నారు.

ఈ నెల 27 నుంచి పదో తరగతి పరీక్షలు ఉన్నందున పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారి ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు ప్రత్యేక తరగ తులు నిర్వహించాలని సూచించారు.
ఇదీ చదవండి:జిల్లా కలెక్టరేట్లను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.. జడ్పీలపై కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details