అనంతపురం జిల్లా రాయదుర్గం, ఉరవకొండలో బాబాకు అభిషేకాలు, అర్చనలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిమఠంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలులో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వై.ఎస్.ఆర్.జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బాబా పాద దర్శనం కల్పించారు. కదిరిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హిందూపురంలో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నెల్లూరు జిల్లాలోని సాయిబాబా ఆలయాల్లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు.
ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
రాష్ట్రవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామునుంచే సాయిబాబు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు.
కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో సాయిబాబా ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. బాపట్ల జిల్లాలోని సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గుంటూరులో సాయినాథుడికి పంచామృత అభిషేకాలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరంలోని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పెద్దఎత్తున భక్తజనం పాల్గొన్నారు. విశాఖలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. పాడేరులో గురు పౌర్ణమి వేళ సత్యసాయి సేవా ట్రస్ట్ వారి ప్రేమ సమాజ వాహనం రాగా.. నృత్యాలు. డప్పు వాయిద్యాలతో భక్తులు 15 కిలోమీటర్లు దూరం పాదయాత్రగా ముందుకు సాగారు.
ఇదీ చదవండి :
TAGGED:
GURUPOURNAMI OVERALL