రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మం ఆధిపత్యాన్ని నవరాత్రి పర్వదినం సూచిస్తుందని... చెడుపై మంచి విజయం సాధిస్తుందనే విషయాన్ని స్పష్టం చేస్తుందని అన్నారు.
దసరా పండుగ సందర్భంగా కనక దుర్గమ్మ రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నానన్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని.. చేతులు శుభ్రం చేసుకోవడం, ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటిస్తూ... పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.