విజయవాడ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉచిత మొబైల్ దంత వైద్యశాల వాహనాన్ని ప్రారంభించారు. ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలోని చిన్నపిల్లల సంక్షేమ కమిటీ, డాక్టరు శ్రీధర్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ఈ వాహనాన్ని చిన్నారుల నవ్వులు పేరిట ఏర్పాటు చేశారు. వాహనం లోపల సదుపాయాలను గవర్నర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లల్లో దంత సమస్యలు అధికమయ్యాయన్న వైద్యులు.. వాటికి గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గవర్నర్‌కు వివరించారు.
సంచార దంత వైద్యశాల వాహనాన్ని ప్రారంభించిన గవర్నర్ - bishwa bhushan
డాక్టరు శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల ఉచిత సంచార దంత వైద్యశాల వాహనాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ ప్రారంభించారు.
సంచార దంత వైద్యశాల వాహనం ప్రారంభించిన గవర్నర్