వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు వీలైనంత త్వరగా ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించేందుకు సమాయత్తమవుతోంది. ఉగాదికే ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ పలు శాఖల నుంచి సమాచారం అందని కారణంగా జాప్యం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్... ఖాళీల వివరాలు అందించని శాఖల నుంచి ఇవాళ సాయంత్రం నాలుగు గంటల వరకు సమాచారం తెప్పించాలన్నారు. ఖాళీల వివరాలను అందించడాన్ని అత్యవసర అంశంగా పరిగణించాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు
రాష్ట్రంలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. ఇవాళ సాయంత్రం వరకు వివిధ శాఖల ఖాళీలను ప్రకటించాలన్న ముఖ్యమంత్రి జగన్... వీలైనంత త్వరగా ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు