ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గోబర్ ధన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ కార్యచరణ

రాష్ట్రవ్యాప్తంగా గోబర్ ధన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ కార్యాచరణ మొదలు పెట్టింది. ప్లాంట్ల ఏర్పాటుకు విధాన రూపకల్పనకు ఉన్నతస్థాయి, సలహా కమిటీలను నియమిస్తూ ఆదేశాలిచ్చింది.

By

Published : Nov 24, 2020, 7:15 PM IST

Published : Nov 24, 2020, 7:15 PM IST

గోబర్ ధన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ కార్యచరణ
గోబర్ ధన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ కార్యచరణ

రాష్ట్రవ్యాప్తంగా గోబర్ ధన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ కార్యాచరణ మొదలు పెట్టింది. గోబర్ ధన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం విధాన రూపకల్పనకు ఉన్నతస్థాయి, సలహా కమిటీలను నియమిస్తూ ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో గోబర్ ధన్ ప్లాంట్ పాలసీ అపెక్స్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సభ్యులుగా పంచాయతీరాజ్, వ్యవసాయం, మార్కెటింగ్, పశు సంవర్థక, ఇంధన శాఖల కార్యదర్శులు ఉంటారని ప్రభుత్వం జీవోలో పేర్కోంది. గోబర్ ధన్ ప్లాంట్ పాలసీ సలహా కమిటీ ఛైర్మన్​గా పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారని స్పష్టం చేసింది. ఇక నోడల్ ఏజెన్సీగా స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ వ్యవహరించనుంది. సలహా కమిటీలో సభ్యులుగా పంచాయతీరాజ్, వ్యవసాయం, మార్కెటింగ్, పశు సంవర్థక, గ్రామీణ నీటి సరఫరా, డెయిరీ డెవలప్​మెంట్ శాఖల ఉన్నతాధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details