పని చేయని ఈవీఎంలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన గద్దె రామ్మోహన్ - polling
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 267 పోలింగ్ బూత్‌లో ఈవీఎం పనిచేయక పోలింగ్ ఆగింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ఈవీఎం మరమ్మతు చేయకపోవడం, దాన్ని మార్చడం పట్ల గద్దె రామ్మోహన్ దంపతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 267 పోలింగ్ బూత్‌లో ఈవీఎం పనిచేయక... పోలింగ్ ఆగింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. అధికారులు ఇంతవరకు ఈవీఎంలు మరమ్మతు చేయలేదని బాధితులు వాపోతున్నారు. పోలింగ్ వేయడానికి వచ్చిన గద్దె రామ్మోహన్ ఆయన సతీమణి గద్దె అనురాధ కుటుంబ సభ్యులు సైతం ఓటు వేయకుండా క్యూ లైన్లో నిలబడ్డారు. ఈవీఎం మరమ్మతు చేయకపోవడం, దాన్ని మార్చడం పట్ల గద్దె రామ్మోహన్ దంపతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సైతం అధికారుల తీరు పట్ల ఎన్నికల అధికారులు వ్యవహార శైలి పట్ల మండిపడుతున్నారు. వృద్ధులు క్యూలైన్లో నిలబడలేక అవస్థలు పడుతున్నారు.