ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓ స్వామీజీ చెప్పారని జగన్ విశాఖకు వెళ్తున్నారు: దేవినేని - former minister Devineni Uma

ఓ స్వామీజీ చెప్పారని ఏప్రిల్ 28న విశాఖ వెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికలు వేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు.

former minister Devineni Uma
మాజీ మంత్రి దేవినేని ఉమ

By

Published : Apr 14, 2020, 7:53 PM IST

ఓ స్వామీజీ చెప్పారని ఏప్రిల్ 28కి విశాఖ వెళ్లేందుకు సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. విశాఖను గ్రీన్ జోన్ గా చూపించేందుకు అక్కడ సరిగా పరీక్షలు నిర్వహించటం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వాస్తవాలను తొక్కి పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరోనా ల్యాబ్‌లు, టెస్టులు ఎందుకు పెంచట్లేదని ప్రశ్నించారు. 300 టెస్టులకు సంబంధించిన రిపోర్టులు గత కొద్దిరోజుల నుంచి ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. కేంద్రం లాక్డౌన్ ఎత్తివేస్తే 5 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నించిందని ఆరోపించారు.

ఐదు కోట్ల ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా ఆ దిశగా చర్యలు లేవని ధ్వజమెత్తారు. ఐసోలేషన్ కు ఎంత ఖర్చుపెట్టారో ప్రభుత్వం లెక్కలు తెలపాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షంగా ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తీసుకెళ్తుంటే మంత్రులతో సీఎం బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. గన్‌మెన్లను తొలగించి భౌతిక దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారని విమర్శించారు. కరోనా సామాజిక వ్యాప్తిని ప్రభుత్వం ఇప్పుడైనా అరికట్టాలని.. లేకుంటే ఇంకా దారుణ పరిస్థితులు నెలకొంటాయని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details