తెలంగాణలో ప్రాజెక్ట్‌ల పనులు పరుగులు పెడుతుంటే.. ఆంధ్ర సీఎం జగన్ ఏం చేస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఆ రాష్ట్రంలో మనవాళ్ళు ఉన్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇంత పిరికి సీఎంను ఎప్పుడు చూడలేదని వ్యాఖ్యానించారు.
రాయలసీమ ద్రోహి సీఎం జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అఫెక్స్ కౌన్సిల్లో నీటి వాటాలపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కమిషన్ల కక్కుర్తి కోసం పలు ప్రాజెక్ట్ పనులు గాలికి వదిలేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.