కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు, భర్త హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. తమపై అన్యాయంగా పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
41 ఏ సీఆర్పీసీ ప్రకారం నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.