విజయవాడ దుర్గగుడి అమ్మవారి వెండిరథం సింహాలు మాయంపై ఫోరెన్సిక్ బృందం ఆరా తీసింది. ఫోరెన్సిక్ డైరక్టర్ డా.శారీన్తో పాటు జాయింట్ డైరక్టర్ సురేశ్ కుమార్ రథాన్ని పరిశీలించారు. రథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి..ఫోటోలు తీసుకున్నారు. స్థానిక పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. గతంలో జరిగిన చోరీలు గురించి ఆరా తీశారు. విలువైన వస్తువులు ఉన్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని..,సీసీ ఫుటేజీని దాచి ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు సూచించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలతోపాటు..,శివాలయం అభివృద్ధి పనుల్లో పాల్గొన్న కూలీలను పోలీసులు విచారించారు.
దుర్గ గుడి వెండి రథాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం - రథాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం
ఫోరెన్సిక్ బృందం విజయవాడ దుర్గ గుడి వెండి రథాన్ని పరిశీలించింది. చోరీ జరిగిన ప్రాంతం, రథాన్ని క్షుణ్నంగా పరిశీలించి స్థానిక పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
దుర్గ గుడి వెండి రథాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం
Last Updated : Sep 28, 2020, 11:11 PM IST