విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి చేదు అనుభవం ఎదురైంది. కుందావారి కండ్రికలో వైఎస్ఆర్ రైతు భరోసా చైతన్యయాత్రల సభలో పాల్గొన్న ఆయనను.. స్థానిక రైతులు నిలదీశారు. ధాన్యం కొనుగోలు చేసి 3 నెలలైనా ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడికి డబ్బులు లేక ఖరీఫ్‌లో పంటలు వేయలేదని గోడు వెల్లబోసుకున్నారు. ధాన్యం బకాయిల చెల్లింపుల్లో జాప్యం వాస్తవమేనన్న ఎమ్మెల్యే.. నెల రోజులలో ఖాతాలకు నగదు జమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి చేదు అనుభవం.. ధాన్యం సొమ్ము కోసం నిలదీసిన రైతులు - farmers question mla malladhi vishnu
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును రైతులు ధాన్యం డబ్బుల కోసం నిలదీశారు. కుందావారి కండ్రికలో వైఎస్ఆర్ రైతు భరోసా చైతన్యయాత్రల సభలో పాల్గొన్న ఎమ్మెల్యేను ధాన్యం సొమ్ము ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలలైనా.. పైసా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
farmers demands mla malladi vishnu for paddy money