ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'డిస్కంలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు'

వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం, విద్యుత్ డిస్కంల ప్రైవేటీకరణలను వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరావు వ్యాఖ్యానించారు. విద్యుత్ సంస్కరణ, వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అన్ని జిల్లాల్లో సబ్ స్టేషన్​ల వద్ద నవంబర్ 27న రైతులు, కార్మికులతో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామన్నారు.

'డిస్కంలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు'
'డిస్కంలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు'

By

Published : Nov 13, 2020, 5:27 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణ, వ్యవసాయ బిల్లులు పార్లమెంట్​లో చట్టం కాకముందే రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం జీవో 22 తీసుకువచ్చిందని మాజీమంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరావు మండిపడ్డారు. కిసాన్ కో ఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్కరణ, వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అన్ని జిల్లాల్లో సబ్ స్టేషన్​ల వద్ద నవంబరు 27న రైతులు, కార్మికులతో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం, డిస్కంల ప్రైవేటీకరణలను వ్యతిరేకిస్తున్నామని..,ఇది ముమ్మాటికీ ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడేందుకే అని ఆరోపించారు.

డిస్కంలను కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని...ఉద్యోగుల అనుమతి లేకుండా అది సాధ్యం కాదని గతంలో సుప్రీం తీర్పు వెలువరించిందని గుర్తుచేశారు. భాజపా పాలిత రాష్ట్రం యూపీలో విద్యుత్ ఉద్యోగుల, రైతుల ఆందోళనతో ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందన్నారు. వైకాపా ప్రభుత్వం ఈ తరహా చట్టాలను తీసుకు రావాలని చూడటం దారుణమన్నారు.

ABOUT THE AUTHOR

...view details