ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు - విజయవాడలో అగ్నిప్రమాదం తాజా వార్తలు

విజయవాడలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు జేసీ(అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌ నేతృత్వంలో కమిటీని నియమించారు. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని పాలనాధికారి కమిటీని ఆదేశించారు.

Establishment of inquiry committee on fire in Vijayawada
విజయవాడలో అగ్నిప్రమాదంపై విచారణ కమిటీ ఏర్పాటు

By

Published : Aug 9, 2020, 7:08 PM IST

విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటైంది. విచారణ కమిటీని నియమిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు జేసీ(అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌ నేతృత్వంలో కమిటీని నియమించారు. కమిటీలో సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ జి.గీతాబాయి, ఆర్‌ఎఫ్‌వో ఉదయ్‌కుమార్‌, విద్యుత్‌ డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారు. ప్రమాద కారణాలు, భద్రతా నిబంధనలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆస్పత్రుల నిర్వహణ లోపాలు, అధిక ఫీజుల వసూలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని పాలనాధికారి కమిటీని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details