ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

By

Published : Aug 8, 2022, 8:29 PM IST

ELECTRICITY PROTEST: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న విద్యుత్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం బిల్లును వెనక్కి తీసుకోకపోతే మెరుపు సమ్మె చేపడతామని ఉద్యోగులు హెచ్చరించారు.

ELECTRICITY PROTEST
ELECTRICITY PROTEST

PROTEST: కేంద్రం తెస్తున్న విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ..రాష్ట్రవ్యాప్తంగా ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. విజయవాడలోని ఏపీసీపీడీసీఎల్​ కార్యాలయం ఎదుట.. నిరసన తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం సరికాదని.. విద్యుత్ ఉద్యోగుల ఐకాసా నేతలు అన్నారు. ఈ బిల్లు వల్ల విద్యుత్ ఉద్యోగులకు మాత్రమే కాకుండా వినియోగదారులు నష్టపోతారని చెప్పారు. ఏలూరులో విద్యుత్ భవన్ వద్ద ఉద్యోగులు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం బిల్లును వెనక్కి తీసుకోని పక్షంలో మెరుపు సమ్మె చేసేందుకు వెనకాడబోమని హెచ్చరించారు.

విజయనగరంలో విద్యుత్ భవనం వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. చట్ట సవరణ పేరుతో డిస్కంలను నిర్వీర్యం చేసే కుట్రకు కేంద్రం పాల్పడుతుందని ఆరోపించారు. విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకు చేస్తున్న ఉద్యమానికి ప్రజలు సహకరించాలని కోరారు. కేంద్రం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details