ఒప్పంద కార్మికులను క్రమబద్దీకరిస్తామని ప్రజా సంకల్ప యాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడలో ఏపీ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించింది. కార్మిక చట్టాలకు విరుద్ధంగా యాజమాన్యాలు సిబ్బందిని తగ్గించడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటి చర్యలను సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు తప్పుపట్టారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. సబ్ స్టేషన్ నిర్వహణ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ.. విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల డిమాండ్ - ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరించాలని విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల డిమాండ్
విజయవాడలో ఏపీ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది. ఒప్పంద కార్మికులను క్రమబద్దీకరిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని.. ఆ సంఘం అధ్యక్షుడు మధుబాబు కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన జీతం వర్తింపచేయాలన్నారు.
క్రమబద్దీకరణ కోసం విజయవాడలో విద్యుత్ ఒప్పంద కార్మికుల డిమాండ్