ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు.. వర్షం కారణంగా తెప్పోత్సవం రద్దు - తెప్పోత్సవం

DUSSEHRA CELEBRATIONS : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఉత్సవాల చివరిరోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. యాగశాలలో పూర్ణాహుతితో అమ్మవారి ఉత్సవాలు.. పరిసమాప్తమయ్యాయి. వర్షం కారణంగా కృష్ణానదిలో జరగాల్సిన దుర్గమల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం రద్దైంది.

DUSSEHRA CELEBRATIONS
DUSSEHRA CELEBRATIONS

By

Published : Oct 5, 2022, 6:50 PM IST

DUSSEHRA CELEBRATIONS COMPLETED : విజయవాడ ఇంద్రకీలాద్రిపై.. దసరా ఉత్సవాలు ముగిశాయి. చివరిరోజు దుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరి దేవిగా భక్తులకు.. దర్శనమిచ్చారు. సింహవాహనంపై కూర్చుని, చెరకుగడ చేతితో పట్టుకుని.. భక్తులకు అభయప్రదానం చేశారు. యాగశాలలో పూర్ణాహుతితో అమ్మవారి ఉత్సవాలు.. పరిసమాప్తమయ్యాయి. వర్షం కారణంగా కృష్ణానదిలో జరగాల్సిన దుర్గమల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం రద్దైంది. జలవిహారం జరపకపోయినా.. ఉత్సవమూర్తులను హంసవాహనంపై ఉంచి పూజలు చేయాలని పురోహితులు భావించారు. కానీ వర్షం వల్ల ఊరేగింపు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో.. మహామండపంలో కుంకుమార్చనలు జరిగే ప్రదేశంలో కొబ్బరికాయ కొట్టి హారతులిచ్చారు. 20 ఏళ్ల క్రితం తెప్పోత్సవం ఇలాగే నిర్వహించామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details