జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం కన్నులపండువగా సాగింది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. దుర్గ మల్లేశ్వర దేవాస్థానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. స్వామి ఆలయం నుంచి కనక దుర్గా నగర్, రథం సెంటర్, వినాయకుడి గుడి, కెనాల్ రోడ్డు మీదుగా దుర్గ ఘాట్ కు చేరుకుని.... పవిత్ర కృష్ణ నది వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి ఆలయం వరకు నగరోత్సవం సాగింది. భక్త బృందాల కొలాటాల నడుమ ..నయనానందకరంగా సాగిన నగరోత్సవాన్ని చూసేందుకు భక్తులు అధికసంఖ్యంలో తరలి వచ్చారు.
'నయనానందకరం..శ్రీ దుర్గా మల్లేశ్వర నగరోత్సవం' - kanaka duraga
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల కోలాటాలు, మేళ తాళాల నడుమ స్వామి, అమ్మవార్ల ఊరేగింపు సాగింది. దుర్గ గుడి అభివృద్ధికి కృషి చేస్తానని దేవాదాయ శాఖ మంత్రి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
'నయనానందకరం..శ్రీ దుర్గా మల్లేశ్వర నగరోత్సవం'