ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సిమెంట్‌ పరిశ్రమకు విజయవాడ చెత్త

విజయవాడను చెత్తరహితంగా తీర్చిదిద్ది... డంపింగ్‌ యార్డులో పేరుకుపోతున్న వ్యర్థాల నిర్వహణకు నగరపాలక సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో వినియోగానికి వీల్లేని ప్లాస్టిక్ వ్యర్ధాలను సిమెంటు ఫ్యాక్టరీలకు ఇంధనంగా అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

By

Published : Nov 22, 2019, 6:59 AM IST

dry-waste-using

సిమెంట్‌ పరిశ్రమకు విజయవాడ చెత్త
విజయవాడలో వందల టన్నుల్లో వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి .దాని నిర్వహణ నగరపాలక సంస్థకు భారంగా తయారైంది.తడి చెత్తను ఎరువుగా మార్చి ఉద్యానవనాలకు ఉపయోగిస్తున్నారు.పొడి చెత్త అవసరమైన మేర తిరిగి ఉపయోగిస్తున్నారు.ఇలా పునర్వినియోగానికి వీల్లేని టైర్లు,ప్లాస్టిక్ సంచులను నగర శివార్లలోని అజిత్ సింగ్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.

ఇలా తరలించిన చెత్త డంపింగ్ యార్డులో భారీగా పేరుకుపోతోంది.ఈ నిల్వలను కరిగించేందుకు కాలుష్య నియంత్రణ మండలితో కలిసి నగరపాలక సంస్థ చర్యలు చేపడుతోంది.దీన్ని ఇంధనంగా వాడుకోవాలన్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణ2016చట్టాన్ని అమలు చేసింది.

అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం ముందుకొచ్చి నగరపాలక సంస్థ-జగ్గయ్యపేట పురపాలక సంస్థతో ఒప్పందం చేసుకుంది.ఇక్కడ చెత్తను ఇంధనంగా వినియోగించుకునే ఒప్పందం కుదుర్చుకుంది.రోజుకు25నుంచి30టన్నుల చెత్త తరలించనుంది.

ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో నిత్యం500టన్నులకుపైగా చెత్త పోగవుతోంది.ఇందులో నుంచి రోజుకు25నుంచి30టన్నులు అల్ట్రాటెక్ పరిశ్రమ...సిమెంట్ ఉత్పత్తికి ఇంధనంగా వాడుకోనుంది. 2023నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు110మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

రాష్ట్రంలో 150 కొత్త పంచాయతీల ఏర్పాటుకు సన్నాహాలు

ABOUT THE AUTHOR

...view details