విజయవాడ ప్రసాదంపాడులో అర్ధరాత్రి మందుబాబుల హల్‌చల్ చేశారు. కొందరు వ్యక్తులు మద్యం మత్తులో వైద్యులతో ఘర్షణకు దిగారు. కారులో వస్తున్న వైద్యులను అడ్డుకుని రాళ్లతో దాడిచేశారు. కారును ధ్వంసం చేయడం సహా బైక్‌పై వస్తున్న మరో వైద్యుణ్ని కొట్టారు. ద్విచక్రవాహనంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
అర్ధరాత్రి మందుబాబులు హల్‌చల్.. వైద్యులపై దాడి
విజయవాడ ప్రసాదంపాడులో గురువారం అర్ధరాత్రి మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో దారిలో వస్తున్న వైద్యులపై దాడిచేశారు. వైద్యుల వాహనాలను ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అర్ధరాత్రి మందుబాబులు హల్‌చల్.. వైద్యులపై దాడి