Cylinder price: గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. చమురు సంస్థలు రూ.50 మేర పెంచాయి. దీంతో విజయవాడలో గ్యాస్ ధర రూ.1077కి చేరింది. సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.183.50 మేర తగ్గించాయి. తాజాగా గృహావసరాల గ్యాస్ ధరను పెంచాయి. పెంచిన గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ్టి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. హైదరాబాద్‌లో గ్యాస్ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది.
జిల్లా/నగరం పేరు | పేరిగిన ధరలు |
విజయవాడ | రూ.1077 |
గుంటూరు | రూ.1092 |
విశాఖపట్నం | రూ.1061 |
అనంతపురం | రూ.1119.50 |
చిత్తూరు | రూ.1089 |
కడప | రూ.1103 |
తూర్పుగోదావరి | రూ.1081.50 |